Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న దళితుడు (వీడియో)

Advertiesment
జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న దళితుడు (వీడియో)
, మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:49 IST)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కట్టి.. ఆయన తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీకి ఓటు వేసినందుకు ఓ దళితుడు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాడు. దీనికి సంబంధిచిన వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాలనపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "జగన్ గారూ, మీ మాటలకు, చేతలకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత దూరం ఉంది. మీరు అసెంబ్లీలో ఎస్సీ కార్పొరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే, మీ నాన్నగారికి గుడికట్టి, మీకు మద్దతిచ్చిన ఓ దళితుడికి ఎంతటి దుస్థితి పట్టిందో చూడండి" అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. 
 
తన నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాడని, పార్టీ నుంచి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దళితుడు బూటుతో తనను తాను కొట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది.
 
మీ పార్టీకి మద్దతిచ్చినందుకు ఓ వ్యక్తి తనను తాను చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్న లోకేశ్, దీన్నిబట్టే మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. దళితులపై వైసీపీ నాయకులు అకృత్యాలకు ఇదొక ఉదాహరణ వైఎస్ జగన్ గారూ అంటే లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడగ విప్పిన ఫ్యాక్షన్ : టీడీపీ నేతను వేటకొడవళ్ళతో నరికి చంపారు