Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారి వెయ్యికాళ్ల మండపం పడగొట్టి అనుభవించారు... రోజా(Video)

తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే వారెవరినీ వదిలిపెట్టనన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. వెయ్యికాళ్ళ మండపం నిర్మాణాన్ని ఎప్పటి లోగా పూర్తి చేస్తారో భక్తులకు టిటిడి చెప్పాలన్నారు. సాక్షాత్తు శ్రీ వేం

Advertiesment
తిరుమల శ్రీవారి వెయ్యికాళ్ల మండపం పడగొట్టి అనుభవించారు... రోజా(Video)
, శనివారం, 16 జూన్ 2018 (20:37 IST)
తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే వారెవరినీ వదిలిపెట్టనన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. వెయ్యికాళ్ళ మండపం నిర్మాణాన్ని ఎప్పటి లోగా పూర్తి చేస్తారో భక్తులకు టిటిడి చెప్పాలన్నారు. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వెయ్యికాళ్ళ మండపంలో కూర్చుని భక్తులను కటాక్షించేవారని పురాణాలు చెబుతున్నాయని, మండపాన్ని కూల్చిన తరువాత కొంతమంది ఎలాంటి ఇబ్బందులు పడ్డారో భక్తులకు తెలుసునని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు రోజా. వెయ్యికాళ్ళ మండపం నిర్మాణం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తానన్నారు. సైకిల్‌కు ఓటేస్తే ప్రజలకు వారికి వారే ఉరేసుకున్నట్లేనన్నారు. 
 
బంధుప్రీతి, కులప్రీతి, మతపిచ్చి పార్టీ తెలుగుదేశం మాత్రమేనని విమర్శించారు. ప్రధానమంత్రి ఎవరో, రాష్ట్రాన్ని విడగొట్టింది ఏ పార్టీయో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌ అని విమర్శించారు. చిత్తూరు జిల్లా అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వస్తోందని, వీటిని మరమ్మత్తులు చేయాల్సిన బాధ్యత టిటిడిపై ఉందన్నారు రోజా. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ను కలిసిన రోజా నగరి నియోజకవర్గంలో టిటిడి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. వీడియోలో చూడండి... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)