Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష?

Advertiesment
ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష?
విజయవాడ , సోమవారం, 30 ఆగస్టు 2021 (10:09 IST)
14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ ఒక్క మంచి పని చేయలేదని, ఎన్నికలప్పుడు మాత్రమే టీడీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకు వస్తారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్, నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని తెలిపారు.

  వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు, విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ మోహన్ రెడ్డి చేస్తే, అది చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో టీడీపీ వేదిక ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని అమర్ దుయ్యబట్టారు. 
 
విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు అలసత్వం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఈ దుస్థితి ఏర్పడిందని, విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు 200 రోజులుగా కార్మికులంతా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతుంటే, టీడీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందో చర్చకు తాము సిద్ధమని, అందుకు టీడీపీ నేతలు సిద్ధమా అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ సవాల్‌ విసిరారు.
 
చంద్రబాబుకి ప్రజలు పదే పదే బుద్ధి చెప్పినా...  ఆయన కుట్ర ఆలోచనలు మారటం లేదు. ఏ సమస్య గుర్తుకురానప్పుడు, ఏ రాజకీయ అంశం రాష్ట్రంలో లేనప్పుడు, అప్పుడు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు అని మండిప‌డ్డారు.
 
ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖపట్నాన్ని, హైదరాబాద్‌తో పోటీ పడగలిగే నగరంగా ఉన్న విశాఖను విభజన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించి ఉంటే, ఈరోజు ఏ స్థాయిలో విశాఖ నగరం అభివృద్ధి చెంది ఉండేదో ఒకసారి ఆలోచన చేయాల‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడికి డుమ్మా కొడితే వలంటీర్ ఇంటికి వస్తారు... ఎక్కడ?