Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూడు నెలల్లోనే తిరిగి రాని లోకాలకు..?

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూడు నెలల్లోనే తిరిగి రాని లోకాలకు..?
, శనివారం, 9 జనవరి 2021 (16:19 IST)
తల్లిదండ్రులు ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతుల జీవితంలో విధి వినాశకంగా మారింది. ఆనందంగా సాగాల్సిన వారిజీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లైన మూడు నెలలకు గుండె జబ్బుతో భర్త చనిపోగా… మనోవేదనతో భార్య జనవరి7న గురువారం కన్నుమూసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30)నగరంలోని జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తోంది. ఆమెకు గూడురు అయ్యవారి పాళేనికి చెందిన జగదీష్ తో పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.పెద్దలను ఎదిరించి ప్రేమికులు ఇద్దరూగత సంవత్సరం అక్టోబర్ 29న ప్రేమ వివాహం చేసుకున్నారు.
 
సంతోషంగా సాగిపోతున్నవారి జీవితంలో పెళ్లైన రెండు నెలలకే విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్‌లో భర్త జగదీష్ గుండె పోటుతో మరణించాడు. దీంతో శిరీష మనోవేదనకు గురైంది. ప్రేమించిన భర్త దూరం అవటం, కుటుంబసభ్యులు దగ్గరకు రానివ్వకపోవటంతో మానసికంగా కుంగి పోయింది. స్నేహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
 
ఒంటిరిగా ఉంటున్న ఆమె జనవరి 6వ తేదీన తనకు తోడుగా స్నేహితురాలు రమాదేవిని ఇంట్లో చేర్చుకుంది. 7వ తేదీ సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష స్నేహితురాలికి చెప్పింది. వెంటనే ఆమె ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమించి వివాహం చేసుకున్న కొద్దిరోజులకే భార్యాభర్తలు మరణించటం ఇరు కటుంబాల్లో విషాదం నింపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారం చేయబోయాడు, కత్తితో పొడిచి చంపేసింది, ఆపై పోలీసులకు ఫోన్