చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు. స్మార్ట్ బాయ్. అందంగా ఉండటంతో అమ్మాయిలు కూడా అతనంటే ఇష్టపడుతుంటారు. అదే అతను చేసుకున్న అదృష్టం.. యువతులు చేసుకున్న దురదృష్టం. ప్రేమ, పెళ్ళి పేరుతో 20 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న మన్మథన్.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.
చెన్నైలోని ఆవడి సమీపంలో తిరుములైవాయల్ ప్రాంతంలో నివాసముండే రాకేష్‌శర్మ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువులో ఎప్పుడూ ముందుండే రాకేష్‌కు మంచి ఉద్యోగమే వచ్చింది. జీతం లక్షరూపాయలు. ఆ జీతం చూపించే మొదట్లో పెళ్ళి చేసుకున్నాడు. కానీ జీతం సరిపోకపోవడం.. భార్య కోరికలు తీర్చడానికి ఇబ్బంది పడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది.
అయినా రాకేష్ మాత్రం తనకు తానుగా ధైర్యం చెప్పుకున్నాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని రాకేష్ శర్మ అమ్మాయిలతో ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్ళి చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వారిని వాడుకొని వదిలేయాలనుకున్నాడు. అది కూడా డబ్బులు బాగా ఉన్నవారినే టార్గెట్ చేయాలనుకున్నాడు.
ఇలా ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 మందితో బాగా ఎంజాయ్ చేశాడు. వారితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను జాగ్రత్త చేసి ఆ తరువాత మెల్లగా డబ్బులు డిమాండ్ చేయడం మొదలెట్టేవాడు. పెళ్ళి చేసుకోను.. డబ్బులిస్తే చాలు మీ వీడియోలను డిలీట్ చేస్తానంటూ 20 మందిని మోసం చేసేశాడు.
అయితే కొడుంగైయూరు ప్రాంతానికి చెందిన ఒక యువతికి మాత్రం అడ్డంగా దొరికిపోయాడు రాకేష్ శర్మ. ఆమెతో ఏకాంతంగా కలిసి ఉన్న ఫోటోలను చూపించి తండ్రిని బెదిరించాలనుకున్నాడు. ఆమె తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాకేష్ శర్మ మన్మథన్ అని నిర్థారించుకుని అతన్ని కటాకటాల్లోకి నెట్టారు. అతని గదిలోని కంప్యూటర్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.