Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 రోజుల్లో నివేదిక కావాలి... ఆర్ఆర్ఆర్ కేసులో స్పీకర్ కార్యాలయం

Advertiesment
Lok Sabha Speaker Office
, శుక్రవారం, 18 జూన్ 2021 (16:38 IST)
తనను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసు అధికారులు శారీరకంగా హింసించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సభాహక్కుల నోటీసును ఇవ్వగా దీనిపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. 15 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. 
 
కాగా, ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై కేసులు నమోదు చేశారని, ఆ తర్వాత ఈ కేసులను సీఐడీ పోలీసులు సుమోటోగా స్వీకరించిన తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామరాజు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఈ విచారణ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీని ప్రయోగించారని తెలిపారు. ఏపీ సీఎం, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఈ నోటీసులు ఇచ్చారు. వీటిపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది.
 
ఇదే అంశానికి సంబంధించి రఘురాజు కుమారుడు భరత్, టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు కూడా స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను స్పీకర్ కార్యాలయం పరిగణనలోకి తీసుకుంది. 
 
ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను అందించాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 15 రోజుల్లోగా వివరాలను అందించాలని కేంద్ర హోంశాఖకు నోటీసులు పంపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రపదేశ్ ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!