Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్ణీత కాల వ్యవధిలోనే లబ్ధిదారులకు అందాలి : జాయింట్ కలెక్టర్

Advertiesment
Krishna District
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:13 IST)
రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే లబ్ధిదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. మంగళవారం కృష్ణా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత పామర్రు తాహశీల్దారు సురేష్ బాబుతో కలసి పామర్రు మండలం పెదమద్దాలి, అడ్డాడ, కోమరవోలు గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించారు. 
 
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి సూచనలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను పూర్తి స్థాయిలో అర్ధం చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే లబ్ధిదారులకు అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. 
 
ఈ నెల 25వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు అందించే ఇళ్లస్థల పట్టాల పంపిణీ ప్రక్రియకు సంభందించిన వివరాలను అడిగి తెలుసుకుంన్నారు. అదేవిధంగా జగనన్న చేయూత, జగనన్న తోడు, ఆసరా, నాడు - నేడు పనులపురోగతి పై శాఖల వారి పర్సన్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న రిజిస్ట్రలను పరిశీలించారు. 
 
రైస్ కార్డ్స్ మరియు ప్రభుత్వం అందించే పథకాలకు సంభందించి నిర్ణీత వ్యవధిలోనే దరఖాస్తులు చేసిన ప్రజలుకు సమాదానాలు తెలియజేస్తూ జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కె.మాధవి లత ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసిల్దార్ సురేష్ బాబు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థేల్స్‌ సప్లయర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డు 2020ను అందుకున్న సైయెంట్‌