Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలుష్యంలేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కృష్ణా జిల్లా కలెక్టరు

Advertiesment
కాలుష్యంలేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కృష్ణా జిల్లా కలెక్టరు
, శనివారం, 7 నవంబరు 2020 (08:19 IST)
పారిశుధ్ద్యపనులను మెరుగుపరచి కాలుష్య రహిత  గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత  గ్రామ పంచాయితీ అధికారుదే నని ఇందులో ఎటువంటి అలసత్వం వహించిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరగుతుందని కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అన్నారు. 

గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టరు ఆర్డీవో శ్రీనుకుమార్, మండల స్థాయి అధికారులతో కలసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 

ఈ సందర్బంగా కలెక్టరు బిళ్ళపాడు గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలపై శాఖల వారీ పర్సన్ అసిస్టెంట్లును అడిగి తెలుసుకున్నారు.  వారు నిర్వహిస్తున్న రిజష్టర్లను తనిఖీ చేసారు.  ప్రభుత్వం సేవలను నిర్ణీత సమయంలోనే ప్రజలకు అందిస్తున్న విదానాన్ని పరిశీలించి ప్రశంసించారు. 

అనంతరం  బిళ్ళపాడు గ్రామంలోని వీదుల్లో అద్వాన్నంగా ఉన్న పారిశుధ్ద్య పరిస్థితులను గమణించిన కలెక్టరు గ్రామ పంచాయితీ కార్యదర్శి జనార్థరావును నిలదీచారు.  ఏరోజు చెత్తను ఆరోజే డంపింగ్ యార్డుకు తరళించకుండా ఎందుకు వీదుల్లో ఉంచారని, ప్రజారోగ్యం మీకు పట్టదా.. ఎందుకు ఇంత అలసత్యం వహిస్తున్నారని కలెక్టరు హెచ్చరించారు. 

పంచాయితీ కార్యదర్శి కలెక్టరుకు వివరణ ఇస్తూ గ్రామానికి సంబందించి డంపింగ్ యార్డు లేదని చెప్పగా  సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తెస్తే పరిష్కరిస్తారని ఇలా కలుషితమైన వాతావరణంలో గ్రామాన్ని ఉంచరాదన్నారు.  ఈ రోజే చెత్తను డంపింగ్ యార్డు తరళించాలని కలెక్టరు పంచాయితీ కార్యదర్శని ఆదేశించారు.

అనంతరం నిర్మాణ దశలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టరు పరిశీలించారు. రైతు భరోసా కేంద్రానికి స్థానికులు   రామశాస్త్రి 8 సెంట్లు భూమిని అందంచడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

కలెక్టరు వెంట ఆర్డీవో జి.శ్రీనుకుమార్,తాహశీల్థారు యం. శ్రీనివాసరావు, పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మట్టి దీపం 24 గంటలు పాటు వెలుగుతుంది