Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్రా రవీందర్ రెడ్డిని వదిలేసిన పోలీసులు.. కడప జిల్లా ఎస్పీపై బదిలీవేటు?

harshavardhan raju

ఠాగూర్

, బుధవారం, 6 నవంబరు 2024 (19:29 IST)
వైకాపాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డిని ఆ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని తిరిగి వదిలివేశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు పడింది. సోషల్ మీడియాలో వైకాపా నేత వర్రా రవీంద్రా రెడ్డి చేసిన పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేవలం నోటీసులు మాత్రమే వచ్చి  ఆయనను వదిలివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఎస్పీ బదిలీపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సివుంది. అలాగే, కడప జిల్లాలో మరో సీఐను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలపై రవీంద్రారెడ్డి గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెల్సిందే. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, రవీంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కూడా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 
 
ఇదిలావుంటే, వైకాపా అధికారంలో ఉన్న సమయంలో నాటి విపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాటు లోకేశ్, వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం తెల్లవారుజామున రవీంద్రా రెడ్డిని వదిలేశారు. 
 
కడప తాలుకా పోలీసులు 41-ఏ అతడిని ఇంటికి పంపించి వేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి విడిచిపెట్టారు. అయితే మరో కేసు విషయమై వర్రా రవీంద్రా రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అతడు పరారయ్యాడని గుర్తించారు. దీంతో రవీంద్రారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
 
ఆచూకీ కోసం అతడి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషనులో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వర్రా రవీంద్రా రెడ్డిపై మంగళగిరితో పాటు హైదరాబాద్ నగరంలో కూడా పలు కేసులు ఉన్నాయి. మంగళవారం పులివెందులలో అరెస్టు చేసి అక్కడి నుంచి కడప తీసుకెళ్లి రహస్యంగా విచారించారు. అయితే అనూహ్యంగా వదిలిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు, వర్రా రవీంద్రా రెడ్డి పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమల రావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్విఫ్ట్ జీపీఐ ద్వారా విదేశాలకు పంపబడిన డబ్బు నిజసమయ ట్రాకింగ్‌: ముందున్న ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్