Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్విఫ్ట్ జీపీఐ ద్వారా విదేశాలకు పంపబడిన డబ్బు నిజసమయ ట్రాకింగ్‌: ముందున్న ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్

cash notes

ఐవీఆర్

, బుధవారం, 6 నవంబరు 2024 (19:12 IST)
విదేశాలకు పంపిన డబ్బు కోసం స్విఫ్ట్‌తో కలిసి నిజ-సమయ ట్రాకింగ్ సేవను అందించే మొదటి భారతీయ బ్యాంక్‌గా ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ అవతరించింది. ఇది బ్యాంక్ యొక్క అవార్డు గెలుచుకున్న మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఇది భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సౌకర్యవంతమైన, సమర్థవంతమైన బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడంలో బ్యాంక్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తూ, దాని “కస్టమర్ ఫస్ట్” విధానాన్ని పునరుద్ఘాటిస్తుంది.
 
భారతదేశంలోని కస్టమర్‌లు యుపిఐ లేదా ఐఎంపిఎస్ ద్వారా డిజిటల్ చెల్లింపులకు రియల్ టైమ్ స్టేటస్ అప్‌డేట్‌లు, ట్రేస్‌బిలిటీని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో పొందవచ్చు. అయితే, విదేశాలకు పంపిన డబ్బు విషయానికి వస్తే అదే లేదు. కస్టమర్‌లు తమ ఫుడ్ డెలివరీ లేదా పార్శిల్‌ని ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్‌ని ఆశించడంతో, ఐడిఎఫ్ సి ఫస్ట్  బ్యాంక్ క్రాస్-బోర్డర్ పేమెంట్‌ల వంటి కీలకమైన సేవను అందించడంలో ముందుంది.
 
ఈ ఇంటిగ్రేషన్ గురించి రిటైల్ లయబిలిటీస్ & బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్, శ్రీ చిన్మయ్ ధోబ్లే మాట్లాడుతూ, "స్విఫ్ట్ జీపీఐ సేవలను ప్రవేశపెట్టడం అనేది అధునాతన సాంకేతికతలను స్వీకరించడం, బ్యాంకింగ్ పరిశ్రమను మార్చాలనే మా అంకితభావానికి ప్రతిబింబం. నిజ-సమయ ట్రాకింగ్‌తో, మేము మా కస్టమర్‌లు వారి సరిహద్దు లావాదేవీల యొక్క పూర్తి దృశ్యమానతను కలిగి ఉండటానికి, మెరుగైన సౌలభ్యం, సంతృప్తిని నిర్ధారించడానికి సాధికారత కల్పిస్తున్నాము" అని అన్నారు. 
 
స్విఫ్ట్‌ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రీజినల్ హెడ్ శ్రీ కిరణ్ శెట్టి మాట్లాడుతూ, “జీరో ఫుట్‌ప్రింట్ ఏపిఐ కనెక్టివిటీతో దక్షిణాసియాలో ఏపిఐల ద్వారా జిపిఐలో అందుబాటులో ఉన్న మొదటి భారతీయ బ్యాంక్‌గా అవతరించినందుకు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకుని మేము అభినందిస్తున్నాము. దీనితో బ్యాంక్ ఇప్పుడు తన కస్టమర్లకు చెల్లింపుల యొక్క నిజ-సమయ ట్రాకింగ్‌ను అందించగలదు. సరిహద్దు చెల్లింపుల యొక్క సమగ్రమైన ట్రేస్బిలిటీని అందిస్తూ, వేగం, పారదర్శకతను పెంచడం ద్వారా సరిహద్దు చెల్లింపులలో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మేము 2017లో జీపీఐ ని ప్రారంభించాము. జీపీఐ ట్రాకర్ యొక్క పూర్తి కార్యాచరణలను ఏపిఐల ద్వారా తన కస్టమర్‌లకు అందించడం ద్వారా, ఐడిఎఫ్ సి బ్యాంక్ తన మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్లయింట్‌లకు సరికొత్త కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది" అని అన్నారు. 
 
దగ్గరి బంధువుల నిర్వహణ ఖర్చులు, బహుమతి, విద్య, వైద్యం, విదేశాల్లో ఆస్తి/ఈక్విటీలో పెట్టుబడులు మొదలైన వివిధ ప్రయోజనాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశాలకు డబ్బు పంపడానికి ఆర్బీఐ వ్యక్తులను అనుమతిస్తుంది. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ద్వారా పూర్తిగా డిజిటల్ పద్దతిలో ప్రవాస భారతీయులు కూడా విదేశాలకు నిధులను బదిలీ చేయడానికి వారి ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ ఖాతా నుండి అనుమతించబడతారు. స్విఫ్ట్ జీపీఐ ప్లగ్ఇన్ ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్‌లకు విదేశాలలో నగదు బదిలీని ట్రాక్ చేస్తున్నప్పుడు సరళీకృత మరియు సమాచార అనుభవాన్ని అందిస్తుంది. ఈ ట్రాకర్, ఫండ్‌లు రవాణాలో ఉన్నా లేదా గ్రహీత బ్యాంక్‌కు క్రెడిట్ చేయబడినా వాటి యొక్క ఖచ్చితమైన స్థితిని సూచిస్తుంది. ఇది ఊహించని సంఘటనల సందర్భంలో స్థితిని కూడా ప్రదర్శిస్తుంది, ఉదాహరణకు - తప్పు లేదా తగినంత రిసీవర్ సమాచారం లేకపోవటం వంటివి. సమస్యను పరిష్కరించడానికి కస్టమర్ త్వరిత చర్య తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఈ 24/7 సాధనాన్ని విదేశాలలో చెల్లించడంతో పాటు కాంప్లిమెంటరీ సర్వీస్‌గా అందిస్తోంది, ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తించవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెడి వాన్స్: తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అవుతున్నాడు