Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ విషయంలో పురుషులతో సమానంగా మహిళలున్నారు... రోజా(వీడియో)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రపంచంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఆమె చెప్పిన మాటలు... మహిళలు వంటింటి నుంచి అంతరిక్షం వైపు వెళ్ళే దశలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోను,

Advertiesment
ఆ విషయంలో పురుషులతో సమానంగా మహిళలున్నారు... రోజా(వీడియో)
, గురువారం, 8 మార్చి 2018 (18:53 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రపంచంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఆమె చెప్పిన మాటలు... మహిళలు వంటింటి నుంచి అంతరిక్షం వైపు వెళ్ళే దశలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోను, భారతదేశంలోను తమ శక్తిసామర్థ్యాలను ఎందరో మహిళలు చాటి చెబుతున్నారు. 
 
చదువుల్లోను, రాజకీయాల్లోను, వ్యాపారాల్లోను, క్రీడల్లోను, ఏ రంగమైనాసరే పురుషులకు తాము ఏమాత్రం తక్కువ కాదని సత్తా చాటిచెబుతున్న నా తోటి మహిళలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఓవైపు ఎవరెస్ట్ శిఖరంగా విజయాలు సాధిస్తున్నా, మరోవైపు ఇంట్లో వేధింపులు, అవమానాలు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే చైతన్యవంతులవుతున్న మహిళలు తమ సాధికారిత కోసం తమను తామే రక్షించుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం సంధర్భంగా తమ హక్కులను తామే పోరాడి సాధించుకుంటామని మహిళలందరూ ప్రతిజ్ఞ చేయాలి.
 
హక్కుల కోసం ప్రభుత్వాన్ని అయినా, పోలీసులనయినా, ఎంత పెద్ద వ్యవస్థనయినా ప్రశ్నిస్తానని కంకణం కట్టుకోవాలి. మహిళలంటే అణచివేతకు గురయ్యే బాధితురాలు మాత్రమే కాదు. హక్కులను సాధించే ఆదిపరాశక్తి అని నిరూపించుకునేలా మహిళలంతా ఒక్క తాటిపై వచ్చి పోరాడాలని కోరుకుంటున్నాను. మహిళల భద్రత కోసం, హక్కుల కోసం మహిళా ఎమ్మెల్యేగా నేనెప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని మహిళలకు మాటిచ్చారు రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రిపదవులకు గజపతిరాజు - సుజనా చౌదరీలు రాజీనామా