చంద్రబాబు ఇలా చేస్తారని అనుకోలేదు : పవన్ కళ్యాణ్
ప్రజలకు మంచి పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో టీడీపీకి పార్టీకి మద్దతిచ్చానని, కానీ నేను అనుకున్నది జరగకపోవడంతో విభేదించానని పవన్ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం గోల చ
ప్రజలకు మంచి పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో టీడీపీకి పార్టీకి మద్దతిచ్చానని, కానీ నేను అనుకున్నది జరగకపోవడంతో విభేదించానని పవన్ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం గోల చేస్తున్న టీడీపీ నేతలో ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారని అన్నారు.
పర్సంటేజీలిస్తేనే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతి లభిస్తుందని కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలు తనతో చెప్పారని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని జిందాల్ సంస్థ తనతో చెప్పిందని, కానీ రాష్ట్రంలో పరిస్థితి అనకూలించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలని, కానీ ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలను పీడించి దోచుకుంటున్నాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదని చెప్పారు.