Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్లకు నిప్పుపెట్టి.. యువకుల పైశాచికానందం... ఎక్కడ?

Advertiesment
కార్లకు నిప్పుపెట్టి.. యువకుల పైశాచికానందం... ఎక్కడ?
, సోమవారం, 3 జూన్ 2019 (15:12 IST)
హైదరాబాద్ నగరంలో కొంతమంది పోకిరీలు సభ్యసమాజం ఛీదరించుకునే పనులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా వీధుల్లో పార్క్ చేసివున్న కార్లకు నిప్పు పెట్టి సంతోషం పొందారు. ఫలితంగా ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువ చేసే కార్లు పూర్తిగా దగ్దమైపోయాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును కొంతమంది పోకిరీల ముఠా తగులబెట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని తేల్చారు. పగలంతా హాస్టల్లో ఉండడం.. రాత్రికాగానే వీధుల్లో జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడం లేదా కార్లకు నిప్పంటించి ఆనందపడటం వీరికి నిత్యకృత్యమైపోయింది. దీంతో ఈ పోకిరీల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే లేచి కూర్చొన్న మహిళ