Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య... చేస్తుంటే వీడియో తీశారు...

Advertiesment
నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య... చేస్తుంటే వీడియో తీశారు...
, శుక్రవారం, 31 మే 2019 (19:58 IST)
నడిరోడ్డుపై హత్యలు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. కారణాలు ఏమయితేనే... మానవత్వం నశించి రాక్షసత్వం మేల్కొన్నప్పుడు అలాంటి స్థితిలో తోటి మనిషిని నరికి చంపేస్తుంటారు కొందరు. ఇలాంటి దారుణ ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో జరిగింది. పట్టపగలే కత్తులతో ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే అతి దారుణంగా నరికి చంపారు.
 
సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న మహబూబ్‌ అనే వ్యక్తి తనను ఇద్దరు వ్యక్తులు ఫాలో అవడాన్ని గమనించాడు. అంతే... వేగంగా అతడు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ అతడిని ఆ ఇద్దరు వ్యక్తులు తమ బైకులపై వెంబడించి అడ్డుకుని కత్తులతో నరికారు. 
 
అతడు రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోగా కసితీరా కత్తులతో నరికి చంపేశారు. ఇదంతా రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నవారు చూస్తూనే వున్నారు. కానీ ఎవ్వరూ ఆ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. మహబూబ్ మృతి చెందాడని తెలుసుకున్న తర్వాత హంతకులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కొందరు వీడియో తీస్తూ వున్నారు తప్పించి ఆ దారుణాన్ని ఆపే సాహసం మాత్రం చేయలేదు. కాగా హతుడు ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నా... కిషన్ రెడ్డీ... ప్లీజ్ ప్లీజ్ అని ఏపీ సీఎం జగన్ అంటే...?