Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పడక గదిలో ప్రాణ స్నేహితుడితో భార్య... ప్రశ్నించిన భర్తను...

పడక గదిలో ప్రాణ స్నేహితుడితో భార్య... ప్రశ్నించిన భర్తను...
, శుక్రవారం, 9 ఆగస్టు 2019 (21:54 IST)
స్నేహంగా వుంటూనే అతడి భార్యను లోబరుచుకున్నాడో వ్యక్తి. ఆ తర్వాత విషయం స్నేహితుడికి తెలియడంతో అది కాస్తా భార్యాభర్తల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. దీనితో తనను ప్రశ్నించిన స్నేహితుడిని ఓ బ్రిడ్జికి కిందకు తీస్కెళ్లి బాగా మద్యం తాగించి అంతం చేశాడు. ఆ తర్వాత అది ఆత్మహత్యగా చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు కానీ నిజం బయటపడింది.
 
వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా నిడిగుంటపాళెంలో ప్రకాష్ తన భార్యతో వుంటున్నాడు. ఇతడికి ఇడిమేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే స్నేహితుడున్నాడు. అతడు ప్రకాష్ ఇంటికి వస్తూపోతూ మెల్లగా అతడి భార్యతో సన్నిహితంగా వుంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రాణ స్నేహితుడితో తన భార్య పడక గదిలో కనబడేసరికి అతడు షాక్ తిన్నాడు. ఆమెతో గొడవపడ్డాడు. దాంతో ఆమె అతడిని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
భార్య అలా వెళ్లిపోవడంతో జీర్ణించుకోలేని ప్రకాష్ తన స్నేహితుడు వెంకటేష్ తో గొడవకు దిగాడు. తన భార్య అలా వెళ్లిపోవడానికి కారణం నువ్వేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనితో ప్రకాష్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు వెంకటేష్. దాంతో తన స్నేహితులైన చెన్నకృష్ణయ్య, విజయభాస్కర్‌ల సాయంతో జూలై 30న పక్కా ప్లాన్ వేశాడు. 
 
మద్యం తాగుదాం రమ్మని అతడిని ఓ బ్రిడ్జికి కిందికి తీసుకెళ్లి బాగా తాగి మత్తులోకి జారుకున్నాక గొంతు నులిమి చంపేసి కాలువలో పడి చనిపోయాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. పోస్టుమార్టం నిర్వహించగా అతడు హత్య చేయబడ్డాడని తేలింది. దీనితో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసేసరికి అసలు నిజం బయటకు వచ్చింది. దీనితో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మరో సంచలన నిర్ణయం: పంచాయితీరాజ్ లో ఇంజనీరింగ్ పనులు నిలిపివేత