విజయవాడ ఇపుడు ఫ్యాషన్ షోలకు వేదిక అవుతోంది. ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులతో నేటి తరానికి అవసరం అయిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు విజయవాడలోని హోటల్ నోవోటెల్ లో "హై లైఫ్ బ్రైడ్స్" పేరుతో ఎక్స్ క్లూసివ్ వెడ్డింగ్ బ్రైడల్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఎక్సిబిషన్ జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ వేర్, జ్యువలరీని శనివారం సినీ తారలు రితికా చక్రవర్తి, జెన్నీ హానీ తో పాటు పలువురు టాప్ మోడల్స్ నోవో టెల్ హోటల్ లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎక్సిబిషన్ నిర్వాహకులు డొమినిక్ మాట్లాడుతూ దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నూతన డిజైన్లతో కూడిన వస్త్ర ఉత్పత్తులతో పాటు జూయలరీ, ఫ్యాషన్ ఉత్పత్తులు ఇందులో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చని తెలిపారు. అలాగే, మోడల్స్ ఈ "హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ స్థాయిని పెంచేలా ర్యాంప్ వాక్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. దీనితో ఇదో రంగుల ఫ్యాషన్ వేదిక అవుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.