ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన వెబ్‌సైట్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని సరిచేసేందుకు అధికాకురులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గుంటూరు కార్పొరేషన్ వాసులు పన్నులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా సీడీఎంఏ వెబ్‌సైట్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు తమకేమాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అత్యున్నత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పన్ను నిర్ధారించే వెబ్‌సైట్ పని చేయకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వెబ్‌సైట్ గత ఏడు నెలల నుంచి పనిచేయడం లేదు. అధికారులు ఆదాయవనరులను సమకూర్చుకునేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వెబ్‌సైట్‌ను పని చేయకుండా చేశారనే ఆరోపణలు లేకపోలేదు.