Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాల‌కు వెళ్తా, అనుమ‌తివ్వండి: ఎంపీ విజ‌య‌సాయి

Advertiesment
విదేశాల‌కు వెళ్తా, అనుమ‌తివ్వండి: ఎంపీ విజ‌య‌సాయి
, మంగళవారం, 13 జులై 2021 (12:09 IST)
తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల‌ని వైసీపీ నేత‌, ఎంపీ విజయసాయి రెడ్డి సిబిఐని అభ్య‌ర్థించారు. సిబిఐ కేసులో నిందితుడిగా, ఏ 2గా ఉన్న విజ‌య సాయి దేశం విడిచి వెళ్లరాదన్నఆంక్ష‌లున్నాయి.

సిబిఐ ఆయ‌న్ని అరెస్టు చేసిన త‌ర్వాత‌, బెయిల్ పైన విడుద‌ల చేసేట‌పుడు ఈ షరతును విధించింది. అయితే, తాను ఇపుడు విదేశాల‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ ఆంక్ష‌ల‌ను  సడలించాలని విజ‌య‌సాయి కోరారు.

అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని ఆయన పేర్కొన్నారు. విదేశాల‌కు వెళ్ళేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణ ఈ నెల 16కి సిబీఐ కోర్టు వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ స్టేషన్‌ యార్డులో భారీ మార్పులు