Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడ స్టేషన్‌ యార్డులో భారీ మార్పులు

విజయవాడ స్టేషన్‌ యార్డులో భారీ మార్పులు
, మంగళవారం, 13 జులై 2021 (12:07 IST)
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ స్టేషన్‌ యార్డులో ఇంటర్‌లాకింగ్‌ సిస్టంతో సహా పెద్ద ఎత్తున యార్డులో మార్పు చేర్పులను చేపట్టింది. దీంతో రైళ్ల రాకపోకలలో ముఖ్యంగా సికింద్రాబాద్‌`విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో మెరుగైన సౌలభ్యం ఏర్పడుతుంది.

భారతీయ రైల్వేలో విజయవాడ జంక్షన్‌ ప్రధాన జంక్షన్‌లలో ఒకటి. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ నాలుగు వైపుల ప్రాంతాల రైళ్ల రాకపోకలకు ఈ జంక్షన్‌ కీలకమైనది. గతంలో సికింద్రాబాద్‌ ` విశాఖపట్నం మరియు విశాఖపట్నం ` సికింద్రాబాద్‌ మార్గాలలో ఒకేసారి రైళ్ల రాకపోకలు సాగించినప్పుడు రైళ్లు నిరీక్షించాల్సి వచ్చేది.  ఈ రైళ్లను ఆపినప్పుడు ఇతర మార్గల్లో వచ్చే రైళ్ల రాపోకలపై కూడా ఈ ప్రభావం పడేది.

ఈ సమస్యలను అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడలోని యార్డ్‌ ముఖ్యంగా ఉత్తర భాగం యార్డ్‌లో మార్పులు చేపట్టింది. ఇందులో  భాగంగా, నూతన క్యాబిన్‌ ఏర్పాటు చేయబడిరది, మరో క్యాబిన్‌ మార్చబడిరది మరియు ప్రస్తుతమున్న రెండు క్యాబిన్‌లలో మార్పుచేర్పులు చేశారు : 

32 రూట్లతో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (ఈఐ)తో నూతన బల్బ్‌ క్యాబిన్‌ ఏర్పాటు
న్యూ వెస్ట్‌ బ్లాక్‌ హట్‌ (ఎన్‌డబ్ల్యుబిహెచ్‌) క్యాబిన్‌ మార్చబడిరది మరియు 1.5 కి.మీ నూతన లైన్‌తో 20 రూట్లతో అనుసంధానించబడిరది.ప్రస్తుత క్యాబిన్లు ‘బల్బ్‌ క్యాబిన్‌’లో మరియు ‘డి క్యాబిన్‌’లో  మార్పులు చేపట్టారు. 
 
భారీ ఎత్తున చేపట్టిన మార్పుచేర్పులతో ఈ ప్రధాన జంక్షన్‌లో కలిగే ప్రయోజనాలు : 
ప్రధానంగా సికింద్రాబాద్‌`విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలా వరకు నివారించవచ్చు మరియు ఏకకాలంలో  రైళ్ల  రవాణా సాధ్యపడుతుంది. 

ముఖ్యంగా సికింద్రాబాద్‌`విశాఖపట్నం మరియు విజయవాడ`విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో రైళ్ల నిరీక్షణను అధిగమించవచ్చు. సెక్షనల్‌ సామర్థ్యం పెంపుతో మరిన్ని రైళ్ల నిర్వహణకు అవకాశాలు ఏర్పడుతాయి.
 
సెక్షన్‌లో రైళ్ల సగటు వేగం పెంపుకు అవకాశాలు. యార్డులో రైళ్ల రాకపోకలు నిరాటంకంగా మరియు సజావుగా సాగేందుకు అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఈ మౌలిక సదుపాయాలను త్వరగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన విజయవాడ డివిజన్‌, కనస్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్‌, మరియు ప్రధాన కార్యాలయం అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రత్యేకంగా అభినందించారు.

రద్దీ జంక్షన్‌ అయిన విజయవాడ జంక్షన్‌లో భారీ ఎత్తున చేపట్టిన యార్డ్‌ మార్పులతో బహుళ క్రాసింగ్‌లను నివారించి  రైళ్ల  సర్వీసులను సజావుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి అప్పులిచ్చేవారు ఒక్కరంటే ఒక్కరు లేరు : రఘురామరాజు