Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితుడే చెరిచాడు.... మత్తు మందు కలిపి 29 రోజులు అత్యాచారం....

Advertiesment
స్నేహితుడే చెరిచాడు.... మత్తు మందు కలిపి 29 రోజులు అత్యాచారం....
, బుధవారం, 31 జులై 2019 (12:01 IST)
ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ యువతిని ఇబ్బందికర పరిస్థితులున్నా ఉద్యోగం చేయించేలా చేసింది. కష్టమైనా, సహచర ఉద్యోగులు శారీరకంగా ఇబ్బంది పెడుతున్నా భరించింది. కానీ చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది. మొత్తం 11 మంది ఉద్యోగులు. అందరూ మగవారే. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మీరా అనే యువతి ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో చివరకు హైటెక్ సిటీ వద్దనున్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది.
 
అయితే చేరిన రోజు నుంచి అక్కడ ఆమెకు లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. అయినా తట్టుకుంది. మేనేజర్‌కు కంప్లైంట్ చేస్తే అతను ఆమెను లైంగికంగా వేధించాడు. ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక సహచర స్నేహితుడు రామ్‌కు చెప్పింది. లైట్ తీసుకో అంటూ స్నేహం కలిపాడు.
 
అందరికన్నా రామ్‌నే ఎక్కువగా నమ్మింది మీరా. అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. ఇలా వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. అయితే ఓ రోజు రాత్రివేళ మీరా ఇంటికి రహస్యంగా రామ్ వచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో మత్తు మందు చల్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇలా 29 రోజులు ఆమెపై అత్యాచారం చేశాడు. తనపై జరుగుతున్న అత్యాచారం ఆమెకే తెలియదంటే ఏవిధంగా జాగ్రత్తపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అయితే నీరసంగా ఉన్నట్లుండి ఒకరోజు తన కార్యాలయంలో కిందపడిపోయిన మీరాను రామ్ ఆసుపత్రిలో చేర్పించాడు. వైద్యుడు షాకింగ్ నిజాన్ని తెలపాడు. మీరాను ఎవరో అత్యాచారం చేశారని చెప్పాడు. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు.
 
రామ్ మాత్రం ఏమీ తెలియనట్లు కూర్చుండిపోయాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు. మీరా పనిచేస్తున్న కార్యాలయంలోని వారందరినీ విచారించారు. అయితే విషయం బయటకు రాలేదు. మీరా ఉన్న ఇంటి పక్కన ఉన్న సి.సి. ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో రామ్ ఉన్నట్లు తెలుసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రిపుల్ తలాక్: ముస్లిం మహిళలకు ఉపశమనమా, ఉరితాడా?