ఫ్రెండ్ సహజీవనం చేస్తున్న యువతితో అక్రమ సంబంధం పెట్టుకునీ...

ఆదివారం, 28 జులై 2019 (13:41 IST)
తన స్నేహితుడు సహజీవనం చేస్తున్న యువతితో అక్రమం సంబంధం పెట్టుకున్న యువకుడు చివరకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలోని సూర్యారావుపాలెం రోడ్డులో బ్రాందిషాపు వద్ద జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ, దువ్వ గ్రామానికి చెందిన కామన బాలాజీ(25)లు గతంలో గల్ఫ్‌ దేశం ఉపాధి నిమిత్తం వెళ్లి స్నేహితులయ్యారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన అనంతరం రామకృష్ణ సహజీవనం చేస్తున్న యువతితో బాలాజీ స్నేహం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు.
 
ఈ విషయం తెలుసుకున్న శివరామకృష్ణ స్నేహితుడిని పలుసార్లు హెచ్చరించాడు. వినకపోవడంతో ఆ యువతిని గల్ఫ్‌ దేశానికి పంపించాడు. అయినా బాలాజీ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో విషయాన్ని బాలాజీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. ఫలితం లేకపోవడంతో కక్ష పెంచుకున్న శివరామకృష్ణ శుక్రవారం బాలాజీని కలిసి ఇదే విషయమై మాట్లాడుకున్నారు. 
 
ఆ తర్వాత శుక్రవారం రాత్రి 9 గంటలకు దువ్వ బ్రాంది షాపులో ఇద్దరు మద్యం తాగారు. ఆ సమయంలో బాలాజీ అతని ముందే ఆ యువతితో ఫోన్‌లో మాట్లాడడంతో శివరామకృష్ణ ఆగ్రహంతో ఊగి పోయాడు. వెంటనే తన దగ్గరున్న పదునైన చాకుతో బాలాజీ పీకపై పొడిచి పరారయ్యాడు. బాలాజీ వైన్‌షాపు ఆవరణలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం యాత్రికుడికి నేచురోతపతి మసాజ్ చేసిన ఎస్పీ..