Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

Advertiesment
Mavoists

సెల్వి

, గురువారం, 22 మే 2025 (21:25 IST)
2026 మార్చి 31 నాటికి సీపీఐ (మావోయిస్టు)ను నిర్మూలించాలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశం గడువుకు ముందే లక్ష్యాన్ని సాధించబడిందని ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ గురువారం పేర్కొన్నారు.
 
 ఆ లక్ష్యాన్ని సాధించడానికి భద్రతా సిబ్బంది అందరూ దృఢ సంకల్పంతో ఉన్నారని, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవ్ రావు అలియాస్ బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మరణించిన ఎన్‌కౌంటర్ వివరాలను పంచుకుంటూ డీజీపీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మీడియాతో అన్నారు. 
 
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులందరినీ గుర్తించినట్లు డీజీపీ చెప్పారు. అగ్ర నాయకత్వాన్ని తొలగించడం వల్ల పార్టీ వ్యవస్థ పతనమైపోతుంది. మావోయిస్టు పార్టీ కూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటంలో ఛత్తీస్‌గఢ్ ప్రజలు గొప్ప త్యాగాలు చేశారని డీజీపీ కొనియాడారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 27మంది మావోయిస్టులలో 10 మంది మహిళలు కాగా, నలుగురు మావోయిస్టులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. 
 
శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేటకు చెందిన కేశవరావుతో పాటు, ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వెంకట్ నాగేశ్వరరావు అలియాస్ జంగు నవీన్, కేశవరావుకు కంప్యూటర్ ఆపరేటర్, ఏసీఎం బుర్రా వివేక్ అలియాస్ వివేక్, రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన తెలుగువారని డీజీపీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్