Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Advertiesment
Namaz

సెల్వి

, గురువారం, 22 మే 2025 (20:57 IST)
Namaz
తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపింది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నా భద్రతా సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. 
 
పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఓ అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేయడాన్ని చూసిన భక్తులు భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ ఘటన జరిగిన అనంతరం ఆ అన్యమతస్థుడు అక్కడే తమిళనాడకు చెందిన వాహనంలో ఉన్నాడు. తాను నమాజ్ చేసుకుంటానని ఇక్కడున్న వారిని అడిగితే వాళ్లేమీ పట్టించుకోలేదని, అందుకే తానిక్కడే నమాజ్ చేసుకున్నట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు