కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషయంగా మారిన హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గ పరిధిలో గంగవరం మండల సమీపంలోని మామడుగు వద్ద శనివారం జరిగింది.
కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. కారులో ముగ్గురు పెద్దవారు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. జాహ్నవి, భానుతేజ, పావన రామ్, సాయి ఆశ్రీత, విష్ణు కారులో ప్రయాణిస్తున్నారు.
వీరిలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు. వీరు తిరుమల నుంచి కర్ణాటక బెంగళూరుకు వెళ్తున్నట్టు సమాచారం. టిటిడిలో జూనియర్ అసిస్టెంట్ విష్ణు ప్రాణాలతో బయటపడ్డారు.
కారులో విష్ణుతో పాటూ ఆయన భార్య, కూతురు, కొడుకు, చెల్లెలు, చెల్లెలు కూతురు ఉన్నారు. విష్ణు గాయాలతో బయటపడగా మిగిలిన వారు సజీవ దహనమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చిన స్థానికులు కంటతడి పెట్టారు.