ప్రేమికుడితో కలిసి సీక్రెట్ ప్లేస్‌కు వెళ్లిన యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సీక్రెట్‌గా మాట్లాడుకుందామని నిర్మానుష్య ప్రాంతానికి ఓ ప్రేమ జంట వెళ్లింది. అయితే అక్కడ మద్యం సేవిస్తున్న కొందరు దుండగులు వారిని గమనించి వాళ్ల వద్దకు వెళ్లారు.
ఆపై కత్తితో యువకుడిని బెదిరించి ఐదుగురు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో 19 ఏళ్ల యువతి తన కాలేజీలో చదివే అబ్బాయితో కలిసి బెంగళూరు, పుదుచ్చేరి ఔటర్ రింగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద కలిసి మాట్లాడుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వీరు ఆ ప్రాంతానికి వెళ్లారు.
కానీ అదే సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ వుండటం గమనించారు. వారు మరో ముగ్గురిని రప్పించి.. ప్రేమ జంటను బెదిరించి. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి.. గట్టిగా పట్టుకుని బాయ్ ఫ్రెండ్ ముందే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.