Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్ బుక్ ద్వారా వ‌ల‌... రూ.27 ల‌క్ష‌ల కుచ్చు టోపీ!

Advertiesment
ఫేస్ బుక్ ద్వారా వ‌ల‌... రూ.27 ల‌క్ష‌ల కుచ్చు టోపీ!
విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (11:15 IST)
ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌యం అయింది. అత‌డు ఆమెను నిజం అని న‌మ్మేసాడు. ఇలా పరిచయమై అపరిచిత యువతులు విసిరిన వలలో సెజ్ ఉద్యోగి మోసపోయారు. ఆ యువతులు ఆడిన నాటకంలో రూ. 27 లక్షల పైనే పోగొట్టుకున్నారు. ఈ విష‌యాన్ని పోలీసులు వెల్ల‌డించారు. విశాఖ జిల్లా య‌ల‌మంచిలిలోని స్థానిక సెజ్ లోని ఓ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వి.రబి ప్రసాద్ గుప్తా అచ్యుతాపురంలో ఉంటున్నారు.

 
నాలుగు నెలల క్రితం ఇతనికి ఫేస్ బుక్ ద్వారా క్లారా మోర్గాన్ పేరుతో యువతి పరిచయమైంది. ఇద్దరూ రోజూ మాట్లాడుకునే వారు. తాను లండన్లో ఉంటున్నానని, ఇండియాకు వస్తున్నట్లు విమాన టికెట్లను గుప్తాకి పంపించింది. తన వద్ద 5,32,000 పౌండ్లకు సంబంధించిన డీడీ ఉందని గుప్తాలో ఆశలు కల్పించింది. దిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం రూ.68,500 అవసరమని కోరింది.
 
 
ప్రియంకా అనే మరో యువతి గుప్తాకు ఫోను చేసి తాను ఇమిగ్రేషన్ అధికారిణి అని.. క్లారా
మోర్గాన్‌కు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం నగదు అవసరమని చెప్పడంతో 30 సార్లు ఏకంగా రూ.
27. 20 లక్షల నగదును బ్యాంకు ఖాతాకు నెఫ్ట్ ద్వారా పంపించాడు గుప్తా. ఇదంతా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగింది. ఆ తర్వాత ఇద్దరి యువతుల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో
గుప్తాకి అనుమానం వచ్చింది. ఫేస్ బుక్, మెసెంజర్ ఖాతాలు పనిచేయకపోవడంతో మోసపో
యానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబ‌ర్ నేరం కింద ఈ కేసు నమోదు చేసినటు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు పసిపిల్లలను ఉరివేసి... రాజ‌మండ్రిలో కసాయి తల్లి ఘాతుకం