Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ నాయకుల చేతగానితనానికి అదే నిదర్శనం: సురేష్

Advertiesment
Andhra pradesh
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (16:32 IST)
Adimulapu Suresh
రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం టీడీపీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని మంత్రి సురేష్ ఒక ప్రకటనలో ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మొన్న విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, ఇప్పుడు ఎంపీ సురేష్ పై దాడి చేయటం హేమమైన చర్య అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులకు మతి భ్రమించి ఏమి చేయలేని స్థితిలో రైతులను అడ్డుపెట్టుకొని టీడీపీ గుండాలను రంగంలోకి దింపి దాడులకు పాల్పడుతోందన్నారు. 
 
గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన సంగతి అందరికీ తెలుసునని, దానిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా ఎంపీపై కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం జరిగిందన్నారు. 
 
దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇటువంటి చర్యలతో ప్రజాప్రతినిధులను భయపెట్టాలని చూస్తే బెదిరేవాళ్ళు లేరని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌.. నువ్వేమైనా ఎర్రవల్లికి సర్పంచ్‌వా?: రేవంత్‌రెడ్డి