Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త కారుకు పూజ చేసిన పూజారీ... బ్రేక్‌కు బదులు దాన్ని తొక్కాడు.. అంతే..

కొత్త కారుకు పూజ చేసిన పూజారీ... బ్రేక్‌కు బదులు దాన్ని తొక్కాడు.. అంతే..
, ఆదివారం, 26 మే 2019 (10:53 IST)
ఓ పూజారీ తెలిసో తెలియకో చేసిన పనికి పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. కొత్త కారుకు పూజ చేసిన తర్వాత ఆయన బ్రేక్‌ను కాలితో తొక్కాల్సిందిపోయి.. యాక్సిలేటర్‌పై కాలు తొక్కాడు. అంతే.. ఒక్కసారిగా ఆ కారు భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీశైలం పట్టణానికి చెందిన సిద్ధూ అనే పూజారి ఓ కొత్తకారును కొనుగోలు చేశాడు. దానికి స్థానికంగా ఉండే శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం వద్ద పూజలు నిర్వహించేందుకు కారును తీసుకొచ్చాడు. ఈ కారుకు పూజలు ఆయనే స్వయంగా నిర్వహించాడు. 
 
ఆ తర్వాత అనంతరం కారును వెనక్కి తీసే క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లీన్ పాలిటిక్స్ పేరుతో వచ్చా.. సక్సెస్ సాధించాం : నాగబాబు