Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకకోసి చంపేస్తారట : కమెడియన్ వేణుమాధవ్ ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని సినీ నటి రోజా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించిన టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆ

Advertiesment
పీకకోసి చంపేస్తారట : కమెడియన్ వేణుమాధవ్ ఫిర్యాదు
, సోమవారం, 21 ఆగస్టు 2017 (07:07 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని సినీ నటి రోజా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించిన టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన కర్నూలు రెండో పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. 
 
నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేసినందుకు తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఈ పని వైసీపీ వాళ్లే చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పీకకోసి చంపేస్తారమంటూ బెదిరింపులు వచ్చాయని ఆయన పేర్కొనడం గమనార్హం. 
 
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో కొన్ని రోజులుగా పాల్గొంటున్న వేణుమాధవ్.. వైసీపీ తీరుపై, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేయడం తెలిసిందే. 'రోజా' అంటే 'రో' యహాసే 'జా' (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని, టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని... అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని ఇటీవల వ్యాఖ్యానించాడు. 
 
అలాగే, తనకు టీవీ, పేపర్ లేవంటూ తనకు తన తండ్రి వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తిపాస్తులు ప్రజలేనని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేణు మాధవ్ తీవ్రంగానే స్పందించారు. ఆ పేపర్.. ఆ టీవీ చానెల్ ఎవరిది బట్టేబాజ్ అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా అభ్యర్థి శిల్పాకు ఓటేసి గెలిపించండి.. 'నాగార్జున' ఫ్యాన్స్‌కు పిలుపు