Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాటూలు, పొట్టి డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ చేసే రో 'జా' నా ఇలా మాట్లాడేది?: వేణుమాధవ్ ఫైర్

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో సినీ తారలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే వైకాపా తరపున నటి రోజా, తెలుగుదేశం తరపున హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా టీడీపీ తరపున హాస

Advertiesment
టాటూలు, పొట్టి డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ చేసే రో 'జా' నా ఇలా మాట్లాడేది?: వేణుమాధవ్ ఫైర్
, గురువారం, 17 ఆగస్టు 2017 (11:04 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో సినీ తారలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే వైకాపా తరపున నటి రోజా, తెలుగుదేశం తరపున హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా టీడీపీ తరపున హాస్యనటుడు వేణుమాధవ్ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భూమా కుటుంబం తన సొంత కుటుంబం లాంటిదన్నాడు. 
 
మంత్రి భూమా అఖిలప్రియ తన అన్న బిడ్డ అని, తనకు కూమార్తెలాంటిదని వేణుమాధవ్ అన్నాడు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రచారం టీడీపీకి కలిసొస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వేణుమాధవ్ సెటైర్లు విసిరాడు. తన బిడ్డ అఖిలప్రియపై కామెంట్ చేసిన రోజాపై వేణు మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
టాటూలు వేసుకుని.. చిన్న చిన్న డ్రస్సులేసుకుని.. డ్యాన్సులు చేసిన ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని వేణు మాధవ్ అన్నాడు. ఇంకా రోజా అనే పేరుకు వేణు మాధవ్ కొత్త అర్థం చెప్పారు. రోజా అంటే ''రో'' యహాసే 'జా' ఏడ్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళు అని తెలుగులో అర్థమన్నారు. 
 
తాను ప్రచారానికి రాలేదని... టీడీపీకి ఎంత మెజార్టీ వస్తుందో చూద్దామనే వచ్చానని అన్నాడు. ఈ ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వేణుమాధవ్ విన్నవించాడు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని విధంగా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ఓటర్లను వేణు మాధవ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ మోజులో కన్నూమిన్నూ తెలియని తల్లి... కుమార్తెతో వ్యభిచారం.. ఎక్కడ?