Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరెన్సీ మోజులో కన్నూమిన్నూ తెలియని తల్లి... కుమార్తెతో వ్యభిచారం.. ఎక్కడ?

ఓ కసాయి తల్లి కరెన్సీ మోజులో కూరుకుపోయింది. ఫలితంగా ఆమెకు కన్నూమిన్నూతెలియకుండా ప్రవర్తించింది. కన్నబిడ్డ అనే మమకారం లేకుండా బాలికను వ్యభిచారకూపంలోకి దించింది. అటు తల్లి... ఇటు విటులు పెట్టే బాధలు భరి

Advertiesment
Prostitition Daughter
, గురువారం, 17 ఆగస్టు 2017 (10:42 IST)
ఓ కసాయి తల్లి కరెన్సీ మోజులో కూరుకుపోయింది. ఫలితంగా ఆమెకు కన్నూమిన్నూతెలియకుండా ప్రవర్తించింది. కన్నబిడ్డ అనే మమకారం లేకుండా బాలికను వ్యభిచారకూపంలోకి దించింది. అటు తల్లి... ఇటు విటులు పెట్టే బాధలు భరించలేని ఆ బాలిక.. వ్యభిచారవృత్తి నుంచి తప్పించుకుని పోలీసుల చెంత చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
విజయవాడకు సమీపంలోని నున్నలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో 43 యేళ్ళ తల్లితోపాటు ఏడో తరగతి చదివే బాలిక నివశిస్తోంది. ఆమె తల్లి గతంలో కొంతకాలం ఆశావర్కర్‌గా పనిచేసింది. మొదటి భర్తని వదిలేసి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తూ వస్తోంది. పైగా, ఈ వ్యక్తితో కలిసి సినిమాలు, షికార్లతో పాటు పలు రకాల జల్సాలకు అలవాటు పడింది. ఇందుకోసం డబ్బు అవసరమవడంతో కుమార్తెతో వ్యభిచారం చేయించాలని ప్లాన్ వేసింది. 
 
అంతే మరో ఆలోచన లేకుండా ఏడో తరగతి తర్వాత కూతురు చదువు మాన్పించి వ్యభిచారకూపంలోకి లాగేసింది. కన్నకూతురు పాలిట కొరివిగా మారి, కాల్చుకుతినడం మొదలుపెట్టింది. ఒకవైపు తల్లితో పాటు మరోవైపు తన వద్దకు వచ్చే విటులు పెట్టే బాధలు తట్టుకోలేక గత జూన్‌ ఐదోతేదీన బాధితురాలు ఇంటి నుంచి పారిపోయి రైలులో గూడురుకు చేరుకుంది. 
 
ఈ స్టేషన్‌లో అటూఇటూ తిరుగుతుండటంతో, శ్రీకాళహస్తికి చెందిన లీలాకృష్ణకు అనుమానం వచ్చి, ఆ బాలిక వద్ద వివరాలు అడిగి తెలుసున్నాడు. ఆమె చెప్పిన విషయాలు విని చలించిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకొన్నారు. ఇంతలో తన కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి.. నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దర్యాఫ్తు క్రమంలో పోలీసులు బాలిక ఆచూకీ గుర్తించారు. బాలిక ఫిర్యాదుతో తల్లిని, ఆమెతో ఉంటున్న వ్యక్తిని నిర్భయచట్టం కింద అరెస్టు చేశారు. మైనారిటీ తీరని బాలికకు పెళ్లాడినందుకు.. లీలాకృష్ణపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైన్స్ క్లాస్ పేరుతో విద్యార్థినిని తాకరానిచోట తాకిన ట్యూటర్...