తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలపై కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... '' పవన్ కల్యాణ్ భక్తుడిని నేను. కాలర్ ఎగరేసుకుని తిరుగుతా. నా ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డులు, ఇంకేమైనా వున్నాయా మీ దగ్గర. ఇదిగో చిట్టిరెడ్డి పోస్టర్, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో.
ఆ అమ్మాయి బాధితులు ఫోన్లు చేసి డిటైల్స్ ఇస్తామని చెప్పారు. ఆమె నిజస్వరూపం ఇస్తాం మీకు అని చెప్పినా నేను క్యారెక్టర్ వున్నవాడిని కనుక అవన్నీ నాకు వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఓ చిన్న పాప వుంది. నాకు అక్కాచెల్లెళ్లు వున్నారు. మహిళలంటే నాకు గౌరవం వుంది. కనుక అవన్నీ నేను చేయనని చెప్పాను.
ఆ అమ్మాయితో నేను మాట్లాడింది విన్నారు. సరే.. వాళ్లు మాట్లాడింది ఏమైంది. నేను తిట్టినా, వాళ్లు కేవలం వింటూ వుంటారా... వాళ్లు డ్యాన్సులు వేసినవి రాలేదా. కిరణ్ రాయల్ షార్ట్ వేస్తే న్యూస్, కిరణ్ రాయల్ పంచె కట్టుకుంటే న్యూస్. కిరణ్ రాయల్ పడుకుంటే పక్కన తెచ్చి ఎవరో ఫోటోనో పెడతారు. మీరు మాత్రం క్లబ్బులు, పబ్బులు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. మీరు పవిత్రమైన కుటుంబం. మేము మాత్రం గాలికొదిలేసారా. పార్టీ ఈ విషయమై వివరణ కోరింది. అవన్నీ ఇచ్చాక మొత్తం వివరంగా చెప్తా'' అంటూ చెప్పారు కిరణ్ రాయల్.