Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవనన్నా... ఇపుడు ఎక్కడున్నావ్... (Video)

Advertiesment
lakshmi victim

ఠాగూర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (10:59 IST)
ఏ ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా.. ఇపుడు ఎక్కడ వున్నావ్ అంటూ జనసేన పార్టీకి చెందిన తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ చేతిలో మోసపోయినట్టుగా చెబుతున్న లక్ష్మీ అనే మహిళ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ, ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా.. ఇప్పుడు మీ జనసేన ఇంఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది నాకు అండగా నిలబడవా అన్న! అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకోవడం తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌కి సరదా.. ఆ మహిళల వద్ద డబ్బులు అయిపోతే సైలెంట్‌గా జారుకుంటాడు. మొన్న మానస.. నేడు నేను (లక్ష్మి).. రేపు ఇంకో అమ్మాయి.. ఇలా ఇంకెంత మంది జీవితాల్ని నాశనం చేస్తావ్ కిరణ్ రాయల్? అంటూ ఆమె ఆరోపించింది. 
 
ఆ మహిళతో 10 ఏళ్ల క్రితమే ఆ మ్యాటర్ సెటిలైంది : కిరణ్ రాయల్ 
 
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మీడియా ముందుకు వచ్చారు. తనపై గత నాలుగు రోజులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... '' గతంలో రోజా ఫిర్యాదుతో నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా నా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో వున్న సమాచారాన్ని చోరీ చేశారు. ఇపుడా డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి నేను భయపడను. ఆమెతో ఏ వైసిపి నాయకుడు టచ్‌‌లో వున్నాడో, ఎవరెవరు ఆమెతో మాట్లాడి వెనుక వుండి కథ నడిపిస్తున్నారో అంతా బైటకు తీస్తాను.
 
ఆర్థిక లావాదేవీలు ప్రతి ఒక్కరికి వుంటాయి. అలానే నాకూ వున్నాయి. ఐతే ఆ వ్యవహారం ఎప్పుడో పదేళ్ల క్రితమే సెటిలైపోయింది. ఇప్పుడు దాన్ని కొంతమంది వైసిపి పేటీఎంగాళ్లు లాగి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ మీవల్ల ఏమీకాదు. ఎందుకంటే నా ఫోన్లు హైకోర్టు దగ్గర వున్నాయి. కనుక నేను ఎవ్వరికీ భయపడేది లేదు.'' అంటూ చెప్పారు.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Andhra Pradesh: కాలువ గట్టుపై బోల్తా పడిన ట్రాక్టర్.. నలుగురు మహిళలు మృతి