తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మీడియా ముందుకు వచ్చారు. తనపై గత నాలుగు రోజులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... '' గతంలో రోజా ఫిర్యాదుతో నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా నా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో వున్న సమాచారాన్ని చోరీ చేసారు. ఇపుడా డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి నేను భయపడను. ఆమెతో ఏ వైసిపి నాయకుడు టచ్ లో వున్నాడో, ఎవరెవరు ఆమెతో మాట్లాడి వెనుక వుండి కథ నడిపిస్తున్నారో అంతా బైటకు తీస్తాను.
ఆర్థిక లావాదేవీలు ప్రతి ఒక్కరికి వుంటాయి. అలానే నాకూ వున్నాయి. ఐతే ఆ వ్యవహారం ఎప్పుడో పదేళ్ల క్రితమే సెటిలైపోయింది. ఇప్పుడు దాన్ని కొంతమంది వైసిపి పేటీఎంగాళ్లు లాగి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ మీవల్ల ఏమీకాదు. ఎందుకంటే నా ఫోన్లు హైకోర్టు దగ్గర వున్నాయి. కనుక నేను ఎవ్వరికీ భయపడేది లేదు.'' అంటూ చెప్పారు.