Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీటీడీని ముఖ్యమంత్రి రాజకీయ పునరావాసంగా మార్చేందుకు ప్రయత్నించారు: సునీల్ థియోధర్

టీటీడీని ముఖ్యమంత్రి రాజకీయ పునరావాసంగా మార్చేందుకు ప్రయత్నించారు: సునీల్ థియోధర్
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:02 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రపంచంలోనే హిందువుల ఆరాధ్యదైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంద్రప్రదేశ్ బీజేపీ పార్టీ సహా పరిశీలకులు సునీల్ థియోధర్ ఆరోపించారు.

ఈ ఉదయం ఆయన తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం మాట్లాడుతూ తనకు శ్రీవారి నిజపాద దర్శనము లభించటం తన అదృష్టమన్నారు.తనకు ఈ దర్శనం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

స్వామి వారి దర్శనం చేసుకున్న ప్రతిసారి తాను స్వామి వారి గురించి మాత్రమే మాట్లావాడిని అన్నారు.కాని మొదటిసారిగా నేడు  రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చిందని దురదృష్టకరమని, అయితే టిటిడి చట్టంలో అర్హత లేనివారికి పాలకమండలి సభ్యులుగా నియమించటం తీవ్ర అపచారమన్నారు.
 
పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో  కొద్ది మందికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలిసిందన్నారు.
ఇక్కడికి వచ్చిన ప్రతివారు వారు స్వామి వారి కరుణ కటాక్షాలు పొంది వారి ఆశీస్సులతో తిరిగి వెళతారని అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతి దేవస్థానం చట్టంలో అసలు లెనేలేని ప్రత్యేక ఆహ్వనితులు అనే పదాన్ని చేర్చటాన్ని ఆయన తప్పుపట్టారు.

మా‌ పార్టికి చెందిన  పూర్వపు టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి న్యాయ స్తాన్నాన్ని  ఆశ్రయించి దిని పై స్టే తెచ్చారని  ఇందుకు వారికి మరియు టీటీడీ పవిత్రతను తీర్పు ద్వారా కాపాడిన ఏపి హై కోర్టుకి  సునీల్ థియోధర్  ధన్యవాదాలు తెలిపుతున్నట్లు వివరించారు.

ఆఖరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పి.ఏకి  కూడా ఈ ప్రత్యేక ఆహ్వనితులలో చోటు కల్పించారని తెలిసిందని, అతనిపై ఇప్పటికే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ అనే ముద్ర ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో 'తెలంగాణ రక్తచరిత్ర'