వచ్చే రెండేళ్ళలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం తప్పదని బీజేపీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
"వినీతికి పాల్పడిన చంద్రబాబు వచ్చే రెండేళ్లల్లో జైలుకెళ్లక తప్పదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బీజేపీ ఇప్పుడు వినిపిస్తోంది. ఇదే నినాదాన్ని ఎన్టీఆర్ ఏపీలో వివిపించి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అబద్దాలతో బీజేపీని ఏపీలో చంద్రబాబు దెబ్బ తీసే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు అదే పనిగా బీజేపీని టార్గెట్ చేశారు కాబట్టే.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం కాబోతోంది. గత ప్రభుత్వం చేసిన అవినీతిని జగన్ సర్కార్ వెలికి తీయాలి. ఏపీలో కులరహిత రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది.
బీజేపీ ఏ ఒక్క కులానికో చెందిన పార్టీ కాదు. కులరహిత రాజకీయాలనే బీజేపీ ఏపీలో ప్రొత్సహిస్తుంది. సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ ఏపీలో బలపడుతుంది. త్వరలోనే కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలు బీజేపీలో చేరబోతారు" అని సునీల్ దేవధర్ చెప్పుకొచ్చారు.