Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని రైతులతో బాబుకు వచ్చిన తలనొప్పి.. ఏం చేస్తారో?

రాజధాని రైతులతో బాబుకు వచ్చిన తలనొప్పి.. ఏం చేస్తారో?
, బుధవారం, 27 నవంబరు 2019 (17:43 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని పర్యటనను నిరసిస్తూ రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్‌పై దళిత రైతలు నినాదాలు చేపట్టారు. గత ప్రభుత్వం అసైన్డ్ రైతులకు అన్యాయం చేసింది.
 
పట్టా భూములకు ఒక ప్యాకేజ్, అసైన్డ్ రైతులకు ఒక ప్యాకేజ్ ఇచ్చారు. దళితులని చిన్న చూపు చూసారు. మాకు అన్యాయం చేసిన చంద్రబాబు మా ప్రాంతంలో పర్యటించడానికి వీల్లేదు. 
దళిత రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి 
 
దళితుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ దళిత రైతులు నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలిపారు. అలాగే అసైన్డ్ రైతులు కూడా చంద్రబాబుకు నిరసన వ్యక్తం చేశారు. 
 
టీడీపీ హయాంలో దళితులని అణగ తొక్కేందుకు అధికారులని, పోలీస్ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా మాపై ప్రయోగించారు. దళితులకి న్యాయం చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవాలన్నారు
 
 
ఎస్సీ, ఎస్టీ రైతులపై కపట ప్రేమ చూపిన వ్యక్తి చంద్రబాబు..
చంద్రబాబు చేసిన తప్పు వల్లే.. జగన్ సీఎం అయ్యారన్నారు. అలాగే దళితుల ఓట్లతోనే వైసీపీని గెలిపించామని చెప్పుకొచ్చారు. దళితులం అందరం కలసి టీడీపీని ఓడించామని తెలిపారు. 
 
దళిత ద్రోహి చంద్రబాబు
 
రాజధానిలోని ఇసుకని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అందువల్ల రాజధానిలో ఇసుక కొరత ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో దళితులని అణచి వేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. అప్పట్లో Crda కమిషనర్‌గా ఉన్న శ్రీకాంత్‌ని హఠాత్తుగా ఎందుకు బదిలి చేశారు..? తనకి అనుకూలంగా వుండే చెరుకూరి. శ్రీధర్‌ని ఎందుకు నియమించారో సమాధానం చెప్పాలి..? 
 
 
ప్యాకేజి విషయంలో మాకు చాలా అన్యాయం చేసారు. రైతు, రైతు కూలీలని ఏనాడు పట్టించుకోలేదు. నిరుద్యోగులకి ఎటువంటి ఉపాధి కల్పించలేదు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయించావు. 
 
ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే... ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని ఎలా అంటున్నారు. దళితులకు క్షమాపణ చెప్పిన తరువాత.... ఇక్కడ పర్యటించాలని వారు డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేసీ ఫ్యామిలీ మెంబర్స్‌కు హైకోర్టు నోటీసులు