Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగం అడిగితే ఇప్పించాడు.. కానీ భవనంపైకి తీసుకెళ్లి..?

ఓ మహిళా కూలీపై కాంట్రాక్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ బతుకు తెరువు కోసం భర్త, తన నాలుగేళ్ల కూతురితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చి షేక్‌ప

ఉద్యోగం అడిగితే ఇప్పించాడు.. కానీ భవనంపైకి తీసుకెళ్లి..?
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (09:33 IST)
ఓ మహిళా కూలీపై కాంట్రాక్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ బతుకు తెరువు కోసం భర్త, తన నాలుగేళ్ల కూతురితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చి షేక్‌పేటలో నివాసం ఉంటోంది. దినసరి కూలీగా పనిచేస్తున్న ఆమె మూడు రోజుల క్రితం పని కోసం రవి అనే లేబర్ కాంట్రాక్టర్‌ దగ్గరకు వెళ్లింది. 
 
గంజి కోసమని ఏదైనా పని ఇప్పించమని కాంట్రాక్టర్‌ను అడిగింది. ఆమె కష్టం చూసి అతను కూడా పని ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్‌ను సదరు మహిళ దేవుడిగా భావించింది. అయితే ఇంతలోనే అతనిలోని కామాంధుడు బయటకొచ్చాడు. ఆ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
కొత్తగా నిర్మిస్తున్న భవనం వద్దకు తీసుకెళ్లి పనిచేసుకోమన్నాడు. అదే రోజు సాయంత్రం మహిళ వద్దకు వెళ్లిన రవి ఆమెను బలవంతంగా ఆ భవంతి పై అంతస్తుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని తన మనసులోనే దాచుకున్న మహిళ... ఆదివారం జరిగిన దారుణాన్ని భర్తకు తెలియజేసింది. అనంతరం భర్తతో కలిసి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారు... చంద్రబాబు