Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటోలు రోడ్డెక్కితే ఊరుకోం: డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు

ఆటోలు రోడ్డెక్కితే ఊరుకోం: డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు
, సోమవారం, 23 మార్చి 2020 (21:50 IST)
కరోనా వైరస్ జిల్లాలో కేసులు నమోదవుతున్న నైపద్యంలో వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహకరించాలని రోడ్డుపై ప్రజారవాణా వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, టాక్సీలు, ఆటోలు వంటి మొదలగు రవాణా వాహనాలు రోడ్లపై తిరగొద్దని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈ సందర్భంగా సోమవారంనాడు డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 209 జారీ చేసిందని జీవోలో పొంది పరిచిన విధంగా ప్రజారవాణా వాహనాలు నుండి ఆటోల వరకు రోడ్లపై తిరగరాదని పేర్కొన్నారు. లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో ఎవరు ఇంటి నుండి బయటకు రావడం గానీ ప్రయాణించడం గాని మానుకోవాలన్నారు. 

ఈ విషయం గురించి  జిల్లాలోని ఆటోడ్రైవర్ సంఘాలతో యజమానులతో ఇప్పటికే భేటీ అయ్యి వివరించడం జరిగిందన్నారు. చెప్పినకుడా ఆటోలు రోడ్లపై తిరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించే దిశగా ప్రజారవాణా వాహనాలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, టాక్సీలు, ఆటోలు తిరగకుండా ఉండేందుకు నిఘా పెట్టామన్నారు. జిల్లాలో ఇప్పటికే 14 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని ఉదయం నుంచి తనిఖీలు ముమ్మరం చేశామని రోడ్లపై తిరుగుతున్న ఆటోలు సీజ్ చేయడం జరిగిందని అని ఆయన తెలిపారు.

మొత్తం 90 ఆటోలను సీజ్ చేశామన్నారు. అంబులెన్స్ లలో లారీలలో ప్రయాణికులను తీసుకెళ్లిన కూడా సీజ్ చేస్తామన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించినందుకు మరియు మహమ్మారి వ్యాధుల చట్టం ప్రకారం వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఈ చట్టాలు కింద సీజ్ చేసిన వాహనాలను తదుపరి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చేంత వరకు విడుదల చేయడం జరగదని ఆయన తెలిపారు.

ఆటోలు టాక్సీలు మొదలగు రవాణా వాహనములు స్వచ్ఛందంగా నిలుపుదల చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులలో హాస్పిటల్స్ కు వెళ్లేందుకు తప్ప బయటకు రావొద్దని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం: మోదీ