Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించండి: డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు

Advertiesment
ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించండి: డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు
, సోమవారం, 16 మార్చి 2020 (08:37 IST)
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల పూర్తి వివరాలతో కూడిన జాబితాను బస్సులలో ఉంచాలని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులకు డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు సూచించారు. 
 
వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దూరపు ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల పేర్లు, చిరునామా, ఫోన్ నెంబర్లతో కూడిన పూర్తి వివరముల జాబితాలను బస్సులలో ఉంచాలని కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తులు ప్రయాణించినట్లయితే గుర్తించడానికి వీలవుతుందని డిటీసీ తెలిపారు. బస్సుల సీట్లలో వేసి సీట్ కవర్స్, కటేన్స్, దుప్పట్లను ప్రతిరోజు శుభ్రపరిచి వెయ్యాలన్నారు.

బస్సులను శుభ్రంగా ఉంచాలని, బస్సు లోపలకి ప్రయాణికులు ప్రవేశించిన వెంటనే  చేతులను శుభ్రపరచుకొనే విధంగా సానిటైజ్ అందుబాటులో ఉంచాలని ప్రవేటు ట్రావెల్స్ బస్సుల యజమానులను డిటిసి  కోరారు. బస్సులు బయలుదేరేముందే రోజుకు ఒకసారైనా సోడియం హైపోక్లోరైట్ ను ఒకశాతం సాల్యూషన్ రోగకారక క్రిములు చేరకుండా సానీడైజ్ చేయాలన్నారు.

ఇప్పటికే బస్సులను తనిఖీలు చేపట్టడం జరిగిందని బస్సులో ప్రయాణించే ప్రయాణికుల పూర్తి వివరాలతో కూడిన జాబితాను అందుబాటులో ఉంచకపోతే కేసులు నమోదు చేయడం జరుగుతుందని డిటీసీ తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో ప్రయాణించాలన్నారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తి చేతులు తాకడం వలన ఈ వ్యాధి వ్యాపిస్తున్న క్రమంలో చేతులను ఎప్పటికప్పుడు సానిటైజ్ తో శుభ్ర పరచుకోని ప్రయాణించాలన్నారు. చేతులు శుభ్రపరచు కోకుండా మొఖాన్ని, ముక్కును, కళ్ళను తాకాదన్నారు. ప్రయాణించేటప్పుడు కర్చీఫ్ లు గాని మాస్క్ లు గాని ధరించాలని ప్రయాణికులకు డిటీసీ సూచించారు.

దగ్గు, జ్వరం, జలుబు కలిగిన లక్షణాలు ఉన్నట్లయితే బస్సులలో ప్రయాణం చేయొద్దని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని డిటీసీ కోరారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: ఎన్నికల కమిషన్ చర్యలపై ఎమ్మెల్యే ఆనం