Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు మద్దతిచ్చి తప్పు చేశాం.. చెప్పుతో కొట్టుకున్న వైకాపా సర్పంచ్...

sarpanch slipper
, శుక్రవారం, 11 ఆగస్టు 2023 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్‌ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక పనులు చేయించలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పంచాయితీలకు వచ్చిన నిధులను ప్రభుత్వం ఇవ్వకపోగా.. వాటిని తన సొంత అవసరాల కోసం వినియోగిస్తుంది. దీంతో పంచాయతీల్లో పైసా నిధులు లేవు. ఇదేవిషయంపై సర్పంచ్‌లు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో పలువురు సర్పంచ్‌లో ధైర్యం చేసి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
మరికొందరు వినూత్నంగా నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో అరుగొలను గ్రామ సర్పంచ్ పాల్గొని తన ఆవేదనను అక్కసును వెళ్ళగక్కారు. అంతేనా, సీఎం జగన్‌కు మద్దతిచ్చి తప్పు చేశానంటూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేయడం తన పొరపాటని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పును దేవుడు కూడా క్షమించడంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపాడు. 
 
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించింది. దీన్ని నిరసిస్తూ జనసేన - బీజేపీల ఆధ్వర్యంలో గురువారం వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం మండల సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షుడు, అరుగొలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీని బాగు చేస్తారనే ఉద్దేశంతో జగన్‌ను సీఎం చేసేందుకు పదేళ్లపాటు భార్యాపిల్లలను, వ్యాపారాలను వదులుకుని కష్టపడ్డామని చెప్పారు. అప్పట్లో జైలు పాలైన జగన్‌కు బెయిల్ రావాలంటూ మేరీ మాతను వేడుకుని మొక్కులు తీర్చుకున్నానని చెప్పారు. గ్రామాల్లో తాను చేపట్టిన కార్యక్రమాలన్నీ జగన్ పేరునే చేశానని చెప్పారు. 
 
ఇలాంటి ప్పు చేసినందుకు తనని తానే చెప్పుతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో తనుక పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో జనసేన, బీజేపీ, టీడీపీల మద్దతు గట్టెక్కినట్టు చెప్పారు. "నేు చేసిన తప్పును దేవుడు కూడా క్షమించడు. చాలా పెద్ద తప్పు చేశాను. ప్రజలు నన్ను క్షమించాలని కోరుతున్నా" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు అడ్డొస్తున్నాడనీ తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కుమార్తె.. ఎక్కడ?