శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణ రావు మంగళవారం రాత్రి కన్నుమూశారు. పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన నాగభూషణరావు ఈమధ్యనే పదవీవిరమణ చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నాగభూషణ రావు మృతి పట్ల ఏపి స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాగభూషణరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇక ఆయన లేరనే సమాచారం తెలిసిన వెంటనే విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు.