Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయ చరిత్రలో ఏ మంత్రి చేయని పని చేస్తున్న కామినేని శ్రీనివాస్.. ఏంటది?

గత కొన్నిరోజులుగా టిడిపి, బిజెపి నేతల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న విషయం తెలిసిందే. టిడిపి నేతలకన్నా బిజెపి నేతలే మరింతగా రెచ్చిపోయి తెలుగు తమ్ముళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతల్లో సోమువీర్రాజు, విష్ణుకుమార్ రాజు

రాజకీయ చరిత్రలో ఏ మంత్రి చేయని పని చేస్తున్న కామినేని శ్రీనివాస్.. ఏంటది?
, గురువారం, 8 మార్చి 2018 (20:47 IST)
గత కొన్నిరోజులుగా టిడిపి, బిజెపి నేతల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న విషయం తెలిసిందే. టిడిపి నేతలకన్నా బిజెపి నేతలే మరింతగా రెచ్చిపోయి తెలుగు తమ్ముళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతల్లో సోమువీర్రాజు, విష్ణుకుమార్ రాజులు చేసిన వ్యాఖ్యలను పెద్దగా చెప్పనవసరం లేదు. ఓపిక నశించిపోయిన కొంతమంది టిడిపి నేతలు బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులపైనా విమర్శలు చేశారు.
 
ఆ విమర్శలతో కామినేని శ్రీనివాస్ తీవ్రంగా నొచ్చుకున్నారు. కామినేని శ్రీనివాస్ స్వతహాగా చాలా సున్నిత స్వభావుడు. వైద్య, ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ అక్రమంగా అవినీతి డబ్బులను సంపాదించారని టిడిపి నేతలు విమర్శించారు. దీంతో కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను సమర్పించిన తరువాత అసెంబ్లీలో ఉద్వేగంగా మాట్లాడారు. 
 
తను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరూపాయి కూడా ఎవరి నుంచి తీసుకోలేదని చెప్పారు. నేను మంత్రిగా అవినీతికి పాల్పడలేదని రేపు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం అయిన కాణిపాక వరిసిద్ధి వినాయక ఆలయంలో ప్రమాణం చేయనున్నట్లు ప్రకటించారు. రేపు బిజెపి నేతలతో కలిసి ఆయన చిత్తూరు జిల్లాకు వచ్చి ప్రమాణం చేయనున్నారు. ఇప్పటివరకు ఏ మంత్రి చేయని విధంగా కామినేని శ్రీనివాస్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తాననడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరేంద్ర మోడీ అనే నేను... నెటిజన్స్ వ్యంగ్యాస్త్రాలు