Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోడీ అనే నేను... నెటిజన్స్ వ్యంగ్యాస్త్రాలు

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఓ డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుం

Advertiesment
నరేంద్ర మోడీ అనే నేను... నెటిజన్స్ వ్యంగ్యాస్త్రాలు
, గురువారం, 8 మార్చి 2018 (20:26 IST)
టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఓ డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా, ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది... ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పొద్దని.. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది.. చాలా కష్టమైంది. ఎంతకష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్లకి భయం.. బాధ్యత ఉండాలి" అంటూ మహేశ్ చెప్పిన డైలాగ్స్ వన్స్‌మోర్ అనిపిస్తున్నాయి. 
 
ఇపుడు ఇదే డైలాగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి అన్వయిస్తున్నారు నెటిజన్లు. 'చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒక ప్రామిస్ చేసి మాట తప్పమని. ఎప్పటికీ నేను ఇచ్చిన మాట నెరవేర్చనని. నా జీవితంలో అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది. అది చాలా కష్టమైంది. ఎంత కష్టమొచ్చినా.. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆ మాట తప్పలేదు. తాను ఇచ్చిన మాటను నెరవేర్చలేదు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోలేదు. ఈ విషయంలో నా విశ్వసనీయతను కోల్పోయినా మా అమ్మకు నేను చేసిన ప్రామిస్‌ను నెరవేర్చాలన్న నిర్ణయానికి కట్టుబడివున్నాను' అంటూ నెటిజెన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రోజు రెండో భార్య శవాన్ని భుజంపై మోశాడు... ఇప్పుడు మూడో భార్యతో...