ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ ఆర్థిక నిపుణులతో పాటు.. విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. కానీ, ఏపీ మంత్రి ఆళ్ళ నాని మాత్రం ఎదురుదాడికి దిగారు.
ఐదేళ్ళపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు గుప్పించారు.
అంతేకాకుండా ప్రభుత్వంపై కావాలని విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు అండ్ కో తొత్తులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. టీడీపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్‌గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని మంత్రి మంత్రి ఆళ్ల నాని విమర్శలు చేశారు.