Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్ల ఆశలు... వారంలో భర్తీ చేసేలా సీఎం బాబు దృష్టి

chandrababu naidu

ఠాగూర్

, గురువారం, 7 నవంబరు 2024 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. దీనిపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ నామినేటెడ్ పోస్టులన్నింటినీ వారం రోజుల్లో భర్తీ చేసేలా ఆయన దృష్టిసారించారు. 
 
కొద్ది రోజుల క్రితం పలు కార్పోరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ నియామకాలు జరిగాయి. అనేక మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం తాము చేసిన పనులు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న కేసుల వివరాలతో నేతలకు బయోడేటా ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
 
ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై సచివాలయంలో నేతలతో దాదాపు ఐదారు గంటలు చంద్రబాబు చర్చించారు. వారంలో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నామినేటెడ్ పదవుల ప్రకటన చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
డోనాల్డ్ ట్రంప్ నికర ఆస్తి ఎంతో తెలుసా.. ఒక్క నెలలో రెట్టింపు ఎలా? 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించారు. వచ్చే యేడాది జనవరిలో అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హరీస్‌పై ఆయన చిరస్మరణీయమైన విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి ట్రంప్ నికర ఆస్తి ఎంత అనేది అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. 
 
గత అక్టోబరు నెల ఆరంభంలో సుమారు 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద విలువ ప్రస్తుతం రెట్టింపు అయింది. నెల వ్యవధిలోనే 8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.67 వేల కోట్లుగా ఉంది. ట్రంప్‌నకు చెందిన మీడియా సంస్థ 'ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్' షేర్లు భారీగా లాభపడడమే సంపద పెరుగుదలకు కలిసొచ్చింది. దీంతో సెప్టెంబరు చివరిలో 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ ఆస్తి విలువ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
 
ఐదు వారాల క్రితం 12.15 డాలర్లుగా ఉన్న ట్రంప్ మీడియా షేర్ విలువ ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. కంపెనీలో తనకు ఉన్న సుమారు 57 శాతం వాటాను విక్రయించబోనని ప్రకటించడంతో ట్రంప్ మీడియా షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో మే, మార్చి నెలల నాటి గరిష్ఠ స్థాయికి షేర్ల విలువ పెరిగింది. అయితే ట్రంప్ మీడియా షేర్లు కంపెనీ పనితీరు ఆధారంగా పెరగలేదని, ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో పెరిగాయని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నా... కమలా హరీస్