Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు ముళ్లు పడిన మూడు రోజుల్లోనే ప్రెగ్నెన్సీ.. ఎలా?

Advertiesment
Andhra Pradesh
, ఆదివారం, 29 ఆగస్టు 2021 (12:45 IST)
సాధారణంగా వివాహమైన తర్వాత భార్య గర్భం దాల్చేందుకు కనీసం ఓ నెల నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ, ఇక్కడ మెడలో మూడు ముళ్లుపడిన మూడు రోజుల్లోనే ఓ నవ వధువు గర్భందాల్చింది. ఈ విషయం తెలిసిన భర్తతో పాటు అత్తింటివారు, పుట్టింటివారు షాక్‌కు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చినగంట్యాడకు చెందిన యువతిని గతేడాది డిసెంబరులో ప్రసాద్‌ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ లక్నోకు వెళ్లారు. అక్కడే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. అలా, దశలవారీగా రూ.90 లక్షల ఖర్చు చేయించిన భార్య.. తిరిగి గాజువాక వచ్చేసింది. 
 
ఆ తర్వాత భర్త చెంతకు వెళ్లలేదు. దీంతో భార్య తిరిగి రాకపోవడంతో బాధితుడైన భర్త గాజువాక వచ్చి విచారణ చేశాడు. ఈ విచారణలో అంతకుముందే ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన మరో ఇద్దరితో పెళ్లిళ్లు అయినట్టు షాకింగ్ నిజాలు తెలిశాయి.
 
ఈ క్రమంలో విశాఖ జిల్లా చినగంట్యాడకు చెందిన ఈమె ప్రియుడి కారణంగా ఆ మహిళ గర్భం దాల్చినట్టు తేలింది. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె గర్భవతి అన్న విషయం పెళ్లైన మూడో రోజుకే భర్తకు తెలిసి… ఆమెను వదిలేశాడు. 
 
తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అయిన ప్రియుడి దగ్గరకు వెళ్లి తనను పెళ్ళి చేసుకోవాలని కోరింది. అతను అందుకు ఓ షరతు విధించాడు. పెళ్ళి చేసుకోవాలంటే తన కుటుంబంలో బాగా డబ్బున్న ఓ వ్యక్తిని చూపించి.. ముందు అతడి నుంచి డబ్బు గుంజాలని.. తర్వాత వివాహం చేసుకుందామని ప్రియుడు సూచించాడు. 
 
ఇద్దరూ కలిసి అక్కడ కూడా పెళ్లి డ్రామా ఆడి అతడి నుంచి అందిన కాడికి దోచుకున్నారు. ఈలోపు రెండో భర్తకు విషయం తెలిసిపోయింది. అక్కడి నుంచి ఆమె పరారయ్యింది. తిరిగి ప్రియుడితో కలిసి మరో వ్యక్తిని వలపు వల వేసి.. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. చివరికి రెండో భర్త ఫిర్యాదుపై అడ్డంగా దొరికిపోయింది. నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఎస్ఐ భవానీ ఆత్మహత్య : ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణం...