ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగుడు యాసిడ్‌దా దాడి చేశారు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
గురజాల మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాడు. దాహంగా ఉందని కాస్త మంచినీళ్లు ఇవ్వాలంటూ ఆ ఇంట్లో ఉన్న మహిళను ప్రాధేయపడ్డాడు.
దీంతో ఆ మహిళ జాలిపడి ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి అతడికి ఇస్తుండగానే దుండగుడు తన వెంట తీసుకొచ్చిన యాసిడ్‌ను ఆమె శరీరంపై పోసి పారిపోయాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి వద్ద వివరాలు సేకరిస్తున్నారు. పారిపోయిన దండగుడి కోసం గాలిస్తున్నారు.