Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేసి యువతిని పూడ్చేశాడు.. రెండుగంటల తరువాత బతికొచ్చిన యువతి..ఎలా..?

అత్యాచారం చేసి యువతిని పూడ్చేశాడు.. రెండుగంటల తరువాత బతికొచ్చిన యువతి..ఎలా..?
, మంగళవారం, 30 జులై 2019 (21:42 IST)
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం నిడమర్రులో దారుణం చోటు చేసుకుంది. కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి పొలాల్లోకి వెళ్ళిన యువతిపై పాశవికంగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు తన బండారం ఎక్కడ బయటపడుతోందనని అతి దారుణంగా ఆమె గొంతుపై కాలేసి తొక్కేశాడు. ఊపిరి ఆడకుండా ఉండడంతో చనిపోయిందని భావించి బురదమట్టిలో పూడ్చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ యువతి రెండు గంటల తరువాత బయటపడి ఇంటికి చేరుకుంది.
 
నిడమర్రు దళితవాడకు చెందిన 18యేళ్ల యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంటి సమీపంలోని పొలంలోకి వెళ్ళింది. బహిర్భూమికి యువతి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు ఆమెను చూశాడు. ఆమెను బలాత్కరించాడు. ఆమె ప్రతిఘటించింది. అయితే ఆమెను దారుణంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయింది యువతి. 
 
దీంతో పాశవికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన విషయం బయటపడుతోందనన్న భయంతో ఆమె మెడపై కాళ్లేసి తొక్కాడు. కొద్దిసేపటికి యువతి సైలెంట్‌గా ఉండడంతో చనిపోయిందనుకుని బురద మట్టి ఆమెపై వేసి కనిపించకుండా వెళ్ళిపోయాడు. రెండుగంటల సేపు తరువాత యువతికి స్పృ వచ్చింది. వెంటనే పైకి లేచి బురదను తోసుకుని ఇంటికి వెళ్ళింది యువతి. 
 
జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా రాజేష్ పరారయ్యాడు. రాజేష్ తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీసులు విచారించగా చివరకు అతను పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనీ కిడ్నాప్ కాదట... ఎందుకో తెలిస్తే షాకే..?