Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివాసీ స‌మ‌స్య‌ల్లేవ్... అందుకే మావోయిస్టుల లొంగుబాటు!

Advertiesment
moists
విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (15:03 IST)
ఏపీలో ఈ రోజు ఆరుగురు మావోయిస్టులు స‌రెండ‌ర్ అయ్యార‌ని డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ తెలిపారు. ఆయ‌న డిజిపి కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో వారిని ప్ర‌వేశ‌పెట్టారు.

మావోయిస్టు కమిటీ మెంబర్ గత నెల సరెండర్ అయ్యార‌ని, ఇపుడు మ‌రో ఆరుగురు సరెండర్ అయ్యార‌ని తెలిపారు డివిజనల్ కమాండర్ తో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులు స‌రెండ‌ర్ అయ్యారు. ఇందులో గాదర్ల రవి కూడా ఉన్నాడు.

స్థానిక సమస్యలపై గతంలో మావోయిస్టులు వచ్చి మాట్లాడేవార‌ని, ఇప్పుడు ప్రభుత్వం నుండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయ‌ని డీజీపీ చెప్పారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్క‌రిస్తోంద‌ని, ట్రైబ‌ల్ ఏరియాల్లో 20వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింద‌ని వివ‌రించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంద‌ని, మహిళలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆదివాసీ గూడెం లకు సైతం చేరుతున్నాయన్నారు.

బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్టు రిపోర్టులు వచ్చాయ‌ని, గతంలో మావోయిస్టులు తిరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు పధకాలు అందుతున్నాయ‌న్నారు. గ‌తంలో మావోయిస్టులు పోరాటాలు, ఉద్యమాలు చేసేవారు, రక్తపాతం ద్వారా ఉద్యమం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్ధమైంది...విద్య, వైద్యం సమస్యలు ఇప్పుడు ఆదివాసీలకు లేవు అని డీజీపీ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై పోరాడదామని మావోయిస్టులు అంటున్నా గిరిజనులు ఆసక్తి చూపట్లేద‌ని, గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు అని చెప్పారు.

అనేకమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయార‌ని, గతనెల స్పెషల్ జోన్ కమాండర్ సరెండర్ అయ్యార‌ని వివ‌రించారు. ప్రజాస్వామ్యంలో హింస, రక్తపాతం ద్వారా సాధించేది ఏదీ ఉండదు. రూరల్, ట్రైబల్ ఏరియాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా రీచ్ అవుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది. నేరుగా లబ్దిదారులకు పధకాలు అందుతున్నాయి.

రాష్ట్రంలో నూతన పాలనా విప్లవం వచ్చింది. పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి. పోలీసుల భాష, ప్రవర్తనలో మార్పు వచ్చింది. పాడేరులో మెడికల్ కాలేజ్, బుట్టాయి గూడెం, రంప చోడవరంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రైబల్స్ కు అనేక పదవులు ఇస్తున్నారు...అందుకే మావోయిస్టులకి ఆదివాసీల మద్దతు లేద‌న్నారు. రిక్రూట్ మెంట్ కు ఏపీ యువత ముందుకు రాకపోవడంతో ఛత్తీస్ ఘడ్ నుండి రిక్రూట్ చేసుకుంటున్నారు.

వాళ్లకు స్థానిక సమస్యలపై, తెలుగు భాషపై అవగాహన ఉండట్లేదు. పోరాటాలు లేకపోవడంతో కేవలం తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లలో చాలామంది లొంగిపోవడానికి చూస్తున్నార‌ని డీజీపీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలం మలన్న సేవలో హోం మంత్రి అమిత్ షా